చిత్తూరులో పల్టీకొట్టిన ప్రచారరథం.. పదో తరగతి పరీక్షలకు వెళుతూ ఇద్దరు విద్యార్థుల మృతి!

25-03-2019 Mon 11:26 | Andhra
  • వేగంగా వెళుతూ పల్టీకొట్టిన ఓ పార్టీ కారు
  • ఆరుగురు విద్యార్థులకు గాయాలు
  • ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఓ పార్టీకి చెందిన కారులో విద్యార్థులు వెళుతుండగా, వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

జిల్లాలోని పెదమండ్యం మండలానికి చెందిన విద్యార్థులు ఈరోజు పదో తరగతి పరీక్షలు రాసేందుకు బయలుదేరారు. వీరిని ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచారరథం ఎక్కించుకుంది. మార్గమధ్యంలో కలిచెర్ల వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో శ్రీనివాస్, రామ్మోహన్ అనే బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra PradeshChittoor Districtssc exams2 deadPolice

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more